AP: పల్నాడు జిల్లాలోని వినుకొండ నియోజకవర్గంలో వైసీపీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. శావల్యాపురం మండలం పొట్లూరు గ్రామానికి చెందిన సుమారు 70 వైసీపీ కుటుంబాలు బుధవారం టీడీపీలో చేరాయి. ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు సమక్షంలో ఈ చేరికలు జరిగాయి. చెరుకూరు శ్రీనివాసరావు, ఆదినారాయణ, ప్రసాద్ వంటి కీలక నేతలతో పాటు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పార్టీ కండువా కప్పుకున్నారు.