ప్రముఖ వార్తాపత్రిక 'వాషింగ్టన్ పోస్ట్'లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావంతో దాదాపు 300 మంది ఉద్యోగులను తొలగించినట్లు సమాచారం. సంస్థ పునర్నిర్మాణంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు యాజమాన్యం ప్రకటించినా, ఏఐ వల్ల ఖర్చులు తగ్గించుకునేందుకే ఈ చర్య అని తెలుస్తోంది. ఈ తొలగింపుల్లో కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ తనయుడు, జర్నలిస్ట్ ఇషాన్ థరూర్ కూడా ఉన్నారు. మాజీ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ మార్టీ బారన్ దీనిని జర్నలిజం సమాజానికి 'చీకటి రోజు'గా అభివర్ణించారు.