భారీ అగ్ని ప్రమాదం.. లక్షల్లో ఆస్తి నష్టం (వీడియో)

42చూసినవారు
AP: అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. శారదా నగర్‌ పోస్ట్‌ ఆఫీస్‌ ఎదురు ఉన్న ఓ బిల్డింగ్‌లో మంటలు ఒక్కసారిగా చెలరేగి దట్టమైన పొగ వ్యాపించింది. స్థానికులు వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారమిచ్చారు. ఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రమాదంలో లక్షల్లో ఆస్తినష్టం జరిగినట్లు సమాచారం. విద్యుత్‌ షార్ట్‌సర్క్యూట్ కారణమై ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you