తిరుమల శేషాచలం అడవుల్లో భారీ అగ్నిప్రమాదం (వీడియో)

12చూసినవారు
AP: తిరుపతి సమీపంలోని శేషాచలం అటవీ ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. జీవకోన సమీపంలో ప్రారంభమైన మంటలు మొండోడికోన నుంచి తిమ్మినాయుడుకోన వరకు వ్యాపించి సుమారు 2 కిలోమీటర్ల మేర అడవి దగ్ధమైంది. ఈ ఘటనలో విలువైన వృక్షాలు, వనమూలికలు నాశనమయ్యాయి. వన్యప్రాణులు భయంతో పరుగులు తీశాయి. అటవీ శాఖ, అగ్నిమాపక సిబ్బంది, స్థానికులు కలిసి మంటలను అదుపులోకి తెచ్చేందుకు శ్రమిస్తున్నారు. కొండ ప్రాంతం కావడంతో సహాయక చర్యలకు ఆటంకాలు ఎదురవుతున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్