ఫౌజీ సెట్స్‌లో అగ్నిప్రమాదం.. అభిమానుల్లో ఆందోళన

10570చూసినవారు
ఫౌజీ సెట్స్‌లో అగ్నిప్రమాదం.. అభిమానుల్లో ఆందోళన
ప్రభాస్ నటిస్తున్న 'ఫౌజీ' సినిమా షూటింగ్ హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది. మూవీ సెట్స్‌లో శుక్రవారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ప్రభాస్ లేని సన్నివేశాలను చిత్రీకరిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు అభిమానుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. అయితే, ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని, కేవలం షూటింగ్ ప్రాపర్టీ మాత్రమే దెబ్బతిన్నదని సమాచారం. ఈ ఘటనపై మూవీ టీం స్పష్టత ఇవ్వాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్