AI కంపెనీల అదనపు బిల్లింగ్.. ఉద్యోగులను తగ్గించే సంస్థలకు షాక్

7546చూసినవారు
AI కంపెనీల అదనపు బిల్లింగ్.. ఉద్యోగులను తగ్గించే సంస్థలకు షాక్
AI కంపెనీలు ఉద్యోగులను తగ్గించి, ఖర్చు ఆదా చేయాలని చూస్తున్న సంస్థలకు షాక్ ఇస్తున్నాయి. ఓపెన్ ఏఐ, ఆంత్రోపిక్ వంటి సంస్థలు ఏకంగా రూ.16.15 కోట్లు (1.7 మిలియన్ డాలర్లు) అదనంగా బిల్లులు వేసినట్లు 'వాడిట్' అనే స్టార్టప్ సంస్థ వెల్లడించింది. మార్చి 2026 వరకు 60 కంపెనీల రూ.323 కోట్ల విలువైన AI ఇన్‌వాయిస్‌లను పరిశీలించగా ఈ లోపాలు బయటపడ్డాయి. AI ఏజెంట్లు పదే పదే టాస్క్‌లను లూప్‌లో రన్ చేయడం వల్ల టోకెన్ల వాడకం పెరిగి బిల్లులు అధికమవుతున్నాయని నిపుణులు తెలిపారు. అయితే, ఈ ఆరోపణలను ఓపెన్ ఏఐ, ఆంత్రోపిక్ తోసిపుచ్చాయి.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్