బంగాళాఖాతంలో భారీ క్షిపణి పరీక్ష.. 3190 కి.మీ. పరిధికి నోటమ్ జారీ

2281చూసినవారు
బంగాళాఖాతంలో భారీ క్షిపణి పరీక్ష.. 3190 కి.మీ. పరిధికి నోటమ్ జారీ
భారత రక్షణ రంగం బంగాళాఖాతంలో భారీ క్షిపణి పరీక్షకు సిద్ధమవుతోంది. ఫిబ్రవరి 5, 6వ తేదీల్లో ఈ పరీక్ష నేపథ్యంలో పౌర విమానాల రాకపోకలపై ఆంక్షలు విధిస్తూ నోటమ్ జారీ చేశారు. గతంలో 2,530 కి.మీ. పరిధికి నోటమ్ ఉండగా, ఈసారి దానిని 3,190 కి.మీ.కు పెంచారు. ఇది సుదూర లక్ష్యాలను ఛేదించే స్ట్రాటజిక్ క్షిపణి పరీక్ష అయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. K-సిరీస్ లేదా అధునాతన అగ్ని క్షిపణిని పరీక్షించవచ్చని రక్షణ నిపుణుల అంచనా.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్