ఏపీలో ప్రభుత్వం పలువురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. ఈ బదిలీలు తక్షణమే అమల్లోకి వస్తాయి. ఎస్పీఎఫ్ డీజీ సీహెచ్ త్రివిక్రమ వర్మ డైరెక్టర్ ఎఫ్ఎస్ఎల్గా, ఏసీబీ డైరెక్టర్ జయలక్ష్మి సీఐడీ సైబర్ క్రైమ్స్ ఐజీగా నియమితులయ్యారు. బి. రాజకుమారికి రైల్వే ఐజీతో పాటు సీఐడీ ఉమెన్ సేఫ్టీ ఐజీగా అదనపు బాధ్యతలు దక్కాయి. కాంతి రాణా
టాటా ట్రాఫిక్ మేనేజ్మెంట్, రోడ్ సేఫ్టీ ఐజీగా, విశాల్ గున్ని ట్రైనింగ్ డీఐజీగా, బాబూజీ అట్టాడ టెక్నికల్ సర్వీసెస్ డీఐజీగా పోస్టింగ్ పొందారు.