AP: ఓటుకు నోటు కేసులో సీఎం చంద్రబాబుపై దర్యాప్తు జరపాలని కోరుతూ మత్తయ్య సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. చంద్రబాబు ప్రోత్సాహంతోనే తాను ఈ కేసులో తప్పు చేశానని లేఖలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో, ఓటుకు నోటు కేసులో మత్తయ్య పాత్రపై దర్యాప్తు చేయాలన్న తెలంగాణ ప్రభుత్వ పిటిషన్‌పై సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. తీర్పు రిజర్వ్ అయిన నేపథ్యంలో మత్తయ్య లేఖ కీలకంగా మారింది. లేఖలోని అంశాలను కోర్టులో పిటిషన్‌గా దాఖలు చేయనున్నట్లు మత్తయ్య తరఫు న్యాయవాది తెలిపారు.