గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్ జగన్ నివాసం ముందు 'మావిగన్' ఫ్లెక్సీ ఏర్పాటు చేయడంతో కలకలం రేగింది. 'రాజధాని అమరావతి వద్దు.. మూడు జిల్లాల మావిగన్‌తోనే అభివృద్ధి. యువతకు ఆదర్శం.. సమాజానికి అండ మావిగన్.. వన్ పార్టీ.. వన్ ఫ్లాగ్.. వన్ ఎజెండా' అంటూ ఏలూరి శివాజీ ఈ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కాగా, మచిలీపట్నం-విజయవాడ-గుంటూరు (Machilipatnam-Vijayawada-Guntur) ప్రాంతాలను కలిపి కొత్త రాజధానిగా అభివృద్ధి చేస్తామని జగన్ ప్రతిపాదించిన 'ప్లాన్ బి'కి మద్దతుగా, వ్యతిరేకంగా ఈ ఫ్లెక్సీ వార్ నడుస్తున్న విషయం తెలిసిందే.