ఎంబీబీఎస్‌ గైనకాలజీ పేపర్‌ లీక్‌?

3925చూసినవారు
ఎంబీబీఎస్‌ గైనకాలజీ పేపర్‌ లీక్‌?
కేరళ ఆరోగ్య విశ్వవిద్యాలయం (కేయూహెచ్‌ఎస్‌) నిర్వహించిన ఫైనల్ ఇయర్ ఎంబీబీఎస్ గైనకాలజీ పరీక్షా పత్రం లీకయ్యిందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. జులై 31న జరిగిన పరీక్షలో 15 ప్రశ్నలకు గాను 6 ప్రశ్నలు, విశ్వవిద్యాలయ వెబ్‌సైట్‌లో ముందుగానే అందుబాటులో ఉన్న మోడల్ ప్రశ్నాపత్రం నుంచే యథాతథంగా వచ్చాయని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. దీనివల్ల 24 మార్కులు మోడల్ పేపర్ నుంచే రావడంతో పరీక్ష విశ్వసనీయతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

సంబంధిత పోస్ట్