సామాజిక కార్యకర్త మేధా పాట్కర్ దాఖలు చేసిన పరువు నష్టం కేసులో ఢిల్లీ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 25 ఏళ్ల నాటి ఈ కేసులో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాను నిర్దోషిగా ప్రకటించింది. ఆరోపణలు నిరూపించడంలో ఫిర్యాదుదారు విఫలమయ్యారని కోర్టు పేర్కొంది. 2000లో నర్మదా బచావో ఆందోళనకు వ్యతిరేకంగా వీకే సక్సేనా ప్రకటనలు చేశారని మేధా పాట్కర్ ఆరోపించారు. కాగా 2001లో మేధా పాట్కర్‌పై వీకే సక్సేనా దాఖలు చేసిన కేసులో ఆమెను గత వారం నిర్దోషిగా ప్రకటించారు.