ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం, అమరావతి, తిరుపతి, గన్నవరంలో నాలుగు మెగా కోచింగ్ టెర్మినల్స్ నిర్మించాలని రైల్వేశాఖ నిర్ణయించింది. ఈ టెర్మినల్స్ వల్ల ప్రధాన రైల్వే స్టేషన్లపై ఒత్తిడి తగ్గి, రైళ్ల నిర్వహణ సులభతరం అవుతుంది. విశాఖపట్నం కోసం 500 ఎకరాలు, అమరావతి కోసం 300 ఎకరాలు, గన్నవరం కోసం 145 ఎకరాలు, తిరుపతి-రేణిగుంట మధ్య టెర్మినల్ కోసం భూమి కేటాయించాలని రైల్వేశాఖ ఏపీ ప్రభుత్వాన్ని కోరగా, కూటమి సర్కార్ అంగీకరించింది. భూమి కేటాయింపు పూర్తయిన వెంటనే పనులు ప్రారంభం కానున్నాయి.