మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సోషియో-ఫాంటసీ అడ్వెంచర్ మూవీ ‘విశ్వంభర’ 2026, అక్టోబర్ 16న దసరా కానుకగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. దర్శకుడు వశిష్ట తెరకెక్కిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని యువి క్రియేషన్స్ నిర్మిస్తోంది. ఎం.ఎం.
కీరవాణి సంగీతం అందిస్తున్నారు. అత్యుత్తమ విజువల్ ఎఫెక్ట్స్ కోసం చిత్రయూనిట్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. 'అంజి', 'జగదేకవీరుడు అతిలోకసుందరి' తర్వాత
చిరంజీవి నుండి వస్తున్న పూర్తి స్థాయి సోషియో-ఫాంటసీ సినిమా కావడంతో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.