పల్నాడు జిల్లాలో మరోసారి మెలియాయిడోసిస్ కలకలం

9982చూసినవారు
పల్నాడు జిల్లాలో మరోసారి మెలియాయిడోసిస్ కలకలం
AP: పల్నాడు జిల్లాలో మెలియాయిడోసిస్ వ్యాధి కలకలం సృష్టిస్తోంది. జిల్లాలోని వెల్దుర్తి మండలానికి చెందిన ఒక వ్యక్తి ఇటీవల ఈ వ్యాధి బారినపడి గుంటూరులో చికిత్స పొందుతున్నాడు. తాజాగా, కారంపూడి మండల కేంద్రానికి చెందిన ఓ వ్యక్తికి ఈ వ్యాధి సోకినట్లు వైద్యులు గుర్తించారు. వైద్య పరీక్షల్లో ఇతని కిడ్నీలు, లివర్ దెబ్బతిన్నట్లు తేలింది. గుంటూరులోని ప్రైవేటు ఆసుపత్రి వైద్యులు ఇది మెలియాయిడోసిస్ గా నిర్ధారించారు. అపరిశుభ్రత వల్లనే ఈ వ్యాధి సోకడానికి కారణమని తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్