నెలసరి పరిశుభ్రత కూడా ప్రాథమిక హక్కే: సుప్రీం కోర్టు

7705చూసినవారు
నెలసరి పరిశుభ్రత కూడా ప్రాథమిక హక్కే: సుప్రీం కోర్టు
మహిళల ఆరోగ్యంపై సుప్రీంకోర్టు శుక్రవారం కీలక తీర్పు వెలువరించింది. నెలసరి పరిశుభ్రత కూడా ప్రాథమిక హక్కేనని, రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కు, గోప్యతా హక్కులో ఇది అంతర్భాగమని స్పష్టంచేసింది. పాఠశాలల్లో విద్యార్థినులకు ఉచిత శానిటరీ ప్యాడ్స్ అందించాలని, కనీస పారిశుద్ధ్య సౌకర్యాలు కల్పించాలని కోరుతూ దాఖలైన పిటిషను విచారించిన సుప్రీం.. అన్ని పాఠశాలల్లో పర్యావరణహితమైన శానిటరీ ప్యాడ్స్‌ను ఉచితంగా అందించాలని ఆదేశించింది.

సంబంధిత పోస్ట్