అమెరికా, కెనడాతో కలిసి ఫిఫా ప్రపంచ కప్ 2026కు ఆతిథ్యం ఇస్తున్న మెక్సికో జట్టు రౌండ్ 16కు దూసుకెళ్లింది. రౌండ్ 32లో ఈక్వెడార్‌ను 2-0 తేడాతో ఓడించింది. ఫిఫా ప్రపంచ కప్ చరిత్రలో మెక్సికో 40 ఏళ్ల తర్వాత నాకౌట్ మ్యాచ్‌లో గెలవడం ఇదే తొలిసారి. చివరిసారిగా 1986లో విజయం సాధించింది. ఈ విజయంతో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. మెక్సికో ఆటగాళ్లు జులియన్ ఖ్వినోనెస్, రౌల్ జిమెనెజ్ గోల్స్ సాధించారు. ఈక్వెడార్ ఆటగాడు పియారో హిన్‌కాపీ రెడ్ కార్డ్ అందుకున్నాడు.