తెరపైకి మైఖేల్ జాక్సన్ జీవితం.. 'మైఖేల్' ట్రైలర్ విడుదల

3672చూసినవారు
తెరపైకి మైఖేల్ జాక్సన్ జీవితం.. 'మైఖేల్' ట్రైలర్ విడుదల
ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న 'కింగ్ ఆఫ్ పాప్' మైఖేల్ జాక్సన్ జీవితం ఆధారంగా 'మైఖేల్' సినిమా వస్తోంది. జాక్సన్ పాత్రను ఆయన మేనల్లుడు జాఫర్ జాక్సన్ పోషిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ తాజాగా విడుదలైంది. ఒక సాధారణ పిల్లవాడి నుంచి ప్రపంచం మెచ్చిన మ్యూజిక్ ఐకాన్‌గా ఎలా ఎదిగాడు, ఆయన సంగీత ప్రస్థానం, వివాదాలు, వ్యక్తిగత సమస్యలను ఎలా ఎదుర్కొన్నాడు వంటి అంశాలను ట్రైలర్‌లో చూపించారు. ఈ ఏడాది ఏప్రిల్ 24న సినిమా విడుదల కానుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్