మధ్యప్రాచ్యంలో మారుతున్న రాజకీయ పరిస్థితులు, అస్థిరత ప్రపంచ విమానయాన రంగాన్ని ప్రభావితం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో, ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్, ఇండిగో సంస్థలు ఏప్రిల్ 2 నాటి ప్రయాణాలకు సంబంధించి కీలక అప్‌డేట్స్, ట్రావెల్ అడ్వైజరీలను జారీ చేశాయి. గురువారం పశ్చిమ ఆసియాకు 34 విమానాలు నడుపుతున్నట్లు ఎయిర్ ఇండియా గ్రూప్ ప్రకటించింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు 18 ప్రత్యేక విమానాలు నడుస్తున్నాయి. దుబాయ్, అబుదాబి వంటి నగరాలకు పాక్షికంగా విమానాలు పునరుద్ధరించారు. ప్రయాణికులు తమ ఫ్లైట్ స్టేటస్‌ను ఆన్‌లైన్‌లో తనిఖీ చేసుకోవాలని సూచించారు.