అర్ధరాత్రి పోలీస్‌ ఆపరేషన్.. 37 కేజీల బంగారం సీజ్‌

16247చూసినవారు
అస్సాం పోలీసులు అర్ధరాత్రి భారీ ఆపరేషన్ నిర్వహించి, అక్రమంగా తరలిస్తున్న 37 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ దాదాపు రూ.55 కోట్లకు పైనే ఉంటుందని పోలీసులు తెలిపారు. గువాహటిలో అక్షయ్ బన్సోడే అనే వ్యక్తిని అరెస్టు చేశారు. నిఘా వర్గాల సమాచారంతో ఈ ఆపరేషన్ చేపట్టినట్లు డీసీపీ శాంభవి మిశ్రా తెలిపారు. 24 క్యారెట్ల బంగారు కడ్డీలతో పాటు వెండి ముక్కలు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాకు అంతర్జాతీయ స్మగ్లింగ్ ముఠాతో సంబంధం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

సంబంధిత పోస్ట్