గత కొంతకాలంగా చాలామంది మహిళలు మైగ్రేన్ సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇది సాధారణ తలనొప్పి కాదు. తలలో ఒక భాగంలో కొట్టుకుంటున్నట్లు తీవ్రంగా ఉంటుంది. వాంతులు, మలబద్ధకం, వెలుతురు, శబ్దానికి అసహనం, తల తిరగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అనారోగ్యకరమైన జీవనశైలి, ఒత్తిడి, నిద్రలేమి, హార్మోన్ల మార్పులు దీనికి ప్రధాన కారణాలు. ఆందోళన, మానసిక ఒత్తిడి, ఆలస్యంగా నిద్రపోవడం, స్క్రీన్ సమయం, ఆహారపు అలవాట్లు కూడా మైగ్రేన్‌ను పెంచుతాయి. మంచి జీవనశైలి, సమయానికి నిద్ర, యోగా, ధ్యానం, తగినంత నీరు తాగడం వల్ల దీనిని నియంత్రించవచ్చు.