మినీ స్ట్రోక్‌ను నిర్లక్ష్యం చేయొద్దు.. పెద్ద ప్రమాదానికి హెచ్చరిక!

10160చూసినవారు
మినీ స్ట్రోక్‌ను నిర్లక్ష్యం చేయొద్దు.. పెద్ద ప్రమాదానికి హెచ్చరిక!
ట్రాన్సియెంట్ ఇస్కీమిక్ ఎటాక్ (TIA), మినీ స్ట్రోక్ మెదడుకు రక్త ప్రసరణ తాత్కాలికంగా ఆగిపోవడం వల్ల వస్తుంది. లక్షణాలు కొద్దిసేపటికే తగ్గిపోయినా, 48 గంటల నుంచి 3 నెలల్లోపు పెద్ద స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముఖం వాలిపోవడం, చేయి బలహీనపడటం, మాట తడబడటం, చూపు మసకబారడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి. అధిక రక్తపోటు, మధుమేహం, ధూమపానం వంటి అలవాట్లు ప్రమాదాన్ని పెంచుతాయి. ‘FAST’ సూత్రాన్ని గుర్తుంచుకుని అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్