AP: శ్రీకాకుళం జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి అచ్చెన్నాయుడు శుక్రవారం పర్యటించారు. సంతబొమ్మాళి మండలంలోని వడ్డివాడ, అంట్లవరం, వడ్డితాండ్రలో ముంపునకు గురైన పంట పొలాలను స్వయంగా పరిశీలించారు. అనంతరం గొదలాం, కొల్లిపాడు, లక్కివలస, మరువాడ, మేఘవరం ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితిని తెలుసుకున్నారు. రైతులతో నేరుగా మాట్లాడి పంట నష్టంపై వివరాలు సేకరించారు. క్షేత్రస్థాయిలో పంట నష్టాన్ని సమగ్రంగా అంచనా వేయాలని అధికారులను ఆదేశించారు.