టీటీడీ నిధుల దోపిడీపై చర్చను పక్కదారి పట్టించేందుకు మండలి చైర్మన్‌ను కులమతాల పేరుతో కించపరిచిన సీనియర్ మంత్రి అచ్చెన్నాయుడి తక్షణమే రాజీనామా చేయాలని, ఆయనపై సీఎం చంద్రబాబు చర్యలు తీసుకోవాలని వైసీపీ జనరల్ సెక్రటరీ గడికోట శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. అధికార పక్ష సభ్యుల అనైతిక ప్రవర్తన, మంత్రుల తీరు సిగ్గుచేటని ఆయన ఆక్షేపించారు. హెరిటేజ్ అంశంపై సమాధానం చెప్పలేక సభను పక్కదారి పట్టించే ప్రయత్నం చేయడం హేయమని శ్రీకాంత్‌రెడ్డి అన్నారు.