మాజీ సీఎం వైఎస్ జగన్‌కు మంత్రి కొల్లు రవీందర్ సవాల్ (వీడియో)

5171చూసినవారు
AP: ఇల్లీగల్ మద్యం ఎక్కడ ఉందో చూపించమని మాజీ సీఎం వైఎస్ జగన్‌కు మంత్రి కొల్లు రవీంద్ర సవాల్ విసిరారు. “కూటమి ప్రభుత్వం చర్యలకు సిద్ధంగా ఉంది. కానీ మీరు చేస్తున్నది ఫేక్ ప్రచారమైతే విచారణకు సిద్ధంగా ఉన్నారా జగన్‌?” అని ఆయన ప్రశ్నించారు. కల్తీ మద్యం వల్ల మరణాలు సంభవించాయన్న కథనాలు పూర్తిగా తప్పు అని మంత్రి తెలిపారు. ఇలాంటి ఫేక్‌ వార్తలు ప్రచారం చేస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.