AP: ప్రజా సమస్యల పరిష్కారానికి గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గళ్లా మాధవి ప్రతి మంగళవారం గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో, ట్రాన్స్‌జెండర్స్ అసోసియేషన్ నాయకులు తమకు ఇళ్ల పట్టాలు ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. వారిలో ఒకరైన వర్షిణిని ఎమ్మెల్యే పలకరించి, భిక్షాటన ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. ఉద్యోగం ఇస్తానని, నెలకు రూ.15 వేలు జీతం ఇస్తానని చెప్పినా, వర్షిణి భిక్షాటన ద్వారా నెలకు రూ.30 వేలు వస్తున్నాయని తెలిపింది. దీంతో ఎమ్మెల్యే వెంటనే రూ.25 వేల జీతంతో పీఏగా నియమించుకున్నారు. ఈ చర్యకు మంత్రి లోకేష్ ఎమ్మెల్యేను అభినందించారు.