AP: మంత్రి లోకేష్ డీఎస్సీ పేరుతో అక్రమాలకు పాల్పడ్డారని మాజీ మంత్రి నాని ఆరోపించారు. వై.ఎస్. జగన్ సాక్ష్యాధారాలతో సహా వాటిని బయటపెట్టారని పేర్ని నాని పేర్కొన్నారు. దమ్ముంటే చర్చకు రావాలని
జగన్ లోకేష్‌ను సవాల్ చేశారని, ఇప్పుడు పళ్లున్న చెట్టుకే రాళ్లు తగులుతాయని లోకేష్ అంటున్నారని ఆయన విమర్శించారు. జీవోలు ఇచ్చింది ఎవరో, అధికారులకు ఏం సంబంధమని ప్రశ్నించారు. 7 దశల్లో స్క్రూటినీ చేశామంటున్నారని, కానీ అన్నీ తప్పులతడకేనని వ్యాఖ్యానించారు.