AP: అనంతపురం జిల్లా రాప్తాడులో ఎన్టీఆర్, పరిటాల రవి విగ్రహాల ఆవిష్కరణ సందర్భంగా మంత్రి నారా లోకేశ్ YCP అధినేత జగన్‌కు ఘాటు హెచ్చరికలు జారీ చేశారు. టీచర్ల జోలికొస్తే ఎవరినీ వదిలిపెట్టబోమని, 'దబిడి దిబిడే' అంటూ హెచ్చరించారు. టీచర్లపై దాడులు, బూతులు YCP సంస్కారమా అని ప్రశ్నించిన లోకేశ్, 'ఎర్రపుస్తకం ఉంది, కంగారు పడొద్దు' అని జగన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.