AP: పాఠశాల, ఇంటర్ విద్యాశాఖలపై మంత్రి
లోకేశ్ మంగళవారం సమీక్ష నిర్వహించారు. అక్షర ఆంధ్ర సత్ఫలితాలు ఇస్తోందని, వచ్చే ఏడాదికి సంపూర్ణ అక్షరాస్యత దిశగా అడుగులు పడుతున్నాయని తెలిపారు. ఎమ్మెల్యేలు, స్థానిక నేతలు అక్షర ఆంధ్రలో భాగస్వామ్యం కావాలని, బడి బయట పిల్లలను స్కూళ్లలో చేర్చేలా చొరవ చూపాలని సూచించారు. మిడ్ డే మీల్‌పై ఫీడ్‌బ్యాక్ అందించాలని కోరారు.