AP: మాజీ సీఎం జగన్ విమర్శలకు మంత్రి నారా లోకేష్ కౌంటర్ ఇచ్చారు. కల్తీ మద్యం కేసులను వెలికితీసింది తమ ప్రభుత్వం అని స్పష్టం చేశారు. నిందితులుగా ఉన్న ఇద్దరు టీడీపీ నేతలను అరెస్ట్ చేయించడమే కాకుండా వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేశామని గుర్తుచేశారు. ఐదేళ్ల పాలనలో వైసీపీ ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యం ఇప్పుడు బయటపడుతోందని వ్యాఖ్యానించారు. డబ్బు కక్కుర్తితో జే బ్రాండ్స్ పేరుతో వేలాది ప్రజల ప్రాణాలు తీశారని జగన్‌పై లోకేష్ తీవ్ర విమర్శలు గుప్పించారు.