AP: కాకినాడ జిల్లాలో ఆదివారం మంత్రి లోకేష్ పర్యటించనున్నారు. ఆకుండి లక్ష్మీ స్మారక గోశాలలో నిర్వహించే ‘భారతీయం’ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమంలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల
విద్యార్థులు పాల్గొననున్నారు. విద్యార్థుల్లో దేశభక్తి, నైతిక విలువలను పెంపొందించడమే ఈ కార్యక్రమం లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.