AP: పెట్టుబడుల సమీకరణ లక్ష్యంగా మంత్రి నారా లోకేశ్ ఐదు రోజుల పాటు అమెరికా, కెనడా పర్యటనకు వెళ్తున్నారు. శనివారం గన్నవరం నుంచి బయల్దేరి 10వ తేదీ వరకు పర్యటిస్తారు. తొలి రోజు డల్లాస్‌లో తెలుగు డయాస్పోరా సమావేశంలో పాల్గొంటారు. 8, 9 తేదీల్లో శాన్‌ఫ్రాన్సిస్కోలో పలు కంపెనీల ప్రతినిధులతో భేటీ అవుతారు. 10న టొరంటోలో పర్యటిస్తారు. కాగా, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయన అమెరికా పర్యటనకు వెళ్లడం ఇది రెండోసారి.