భారత మహిళా క్రికెటర్లతో మంత్రి లోకేష్

15589చూసినవారు
భారత మహిళా క్రికెటర్లతో మంత్రి లోకేష్
భారత మహిళా క్రికెటర్లతో మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. క్రీడలను ప్రోత్సహించడానికే 3% స్పోర్ట్స్ కోటా అమలు చేయాలని నిర్ణయించినట్లు లోకేష్ తెలిపారు. శుక్రవారం విశాఖలో 'బ్రేకింగ్ బౌండరీస్ విత్ నారా లోకేష్' పేరిట వారితో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. అసమాన ప్రతిభతో భారత క్రీడాభిమానులు తలెత్తుకునేలా చేశారని మహిళా క్రికెటర్లను లోకేష్ కొనియాడారు. లింగ అసమానతలను తొలగించేందుకు బీసీసీఐ చొరవ అభినందనీయమన్నారు.