AP: ఢిల్లీ పర్యటనలో మంత్రి నారా లోకేష్, హోంమంత్రి వంగలపూడి అనిత బిజీ బిజీగా ఉన్నారు. మొంథా తుపాను నష్టంపై కేంద్రానికి నివేదిక సమర్పించనున్నారు. అమిత్ షా, గ్రామీణాభివృద్ధి మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో భేటీ అయి పునర్నిర్మాణానికి ప్రత్యేక ప్యాకేజీ కోరనున్నారు. పార్లమెంటులో మరికొందరు కేంద్ర మంత్రులను కూడా కలిసే అవకాశం ఉంది. విద్య, స్కిల్ డెవలప్‌మెంట్, మహిళా సంక్షేమ అంశాలపై చర్చించనున్నారు.