AP: తాడేపల్లిలో నిర్వహించిన 'షైనింగ్ స్టార్స్' సత్కార కార్యక్రమంలో మంత్రి లోకేష పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతిభ కనబరిచిన విద్యార్థులే ప్రభుత్వానికి నిజమైన బ్రాండ్ అంబాసిడర్లని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 'ఏపీ మోడల్ ఎడ్యుకేషన్' గురించి చర్చ జరిగేలా విద్యా రంగాన్ని అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. వచ్చే ఏడాదిలో రెండు లక్షల మంది
విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలలకు వచ్చేలా లక్ష్యంగా పెట్టుకున్నామని వెల్లడించారు. విద్యార్థి కేంద్రంగా విద్యాశాఖలో సంస్కరణలు చేపట్టామని, ప్రస్తుతం ప్రభుత్వ స్కూళ్లలో సీట్లకు రికమండేషన్ అడిగే రోజులు వచ్చాయనని మంత్రి లోకేష్ తెలిపారు.