ఏప్రిల్ 1న రాత్రి మంత్రి నారా లోకేష్ ఢిల్లీ వెళ్లనున్నారు. అమరావతి చట్టబద్ధత బిల్లుకు లోక్‌సభ ఆమోదం పొందడమే ఈ పర్యటనకు ప్రధాన కారణం. ఈ బిల్లుకు సహకరించిన ఎంపీలు, కేంద్ర ప్రభుత్వానికి మంత్రి లోకేష్ ధన్యవాదాలు తెలపనున్నారు. రేపు రాజ్యసభలో బిల్లుపై చర్చ జరిగే సమయంలో ఆయన ఢిల్లీలోనే ఉండనున్నారు.