AP: రాజధాని అమరావతి ప్రాంతంలో మంత్రి నారాయణ పర్యటించారు. కొండవీడువాగు, పాలవాగుపై నిర్మాణంలో ఉన్న వంతెనల పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. రాజధాని ప్రాంతంలో వాగులపై 43 వంతెనలు, ఎల్పీఎస్ లేఔట్లలో మరో 26 వంతెనలను సీఆర్డీఏ నిర్మిస్తున్నట్లు అధికారులు వివరించారు. వర్షాకాలం నేపథ్యంలో నీటి ప్రవాహానికి ఎలాంటి ఆటంకాలు కలగకుండా పనులు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలని సూచించారు.