జగన్‍పై నిమ్మల రామానాయుడు ఘాటు విమర్శలు

5451చూసినవారు
జగన్‍పై నిమ్మల రామానాయుడు ఘాటు విమర్శలు
AP: వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై  మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వెలిగొండ ప్రాజెక్టు విషయంలో గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసిన మోసాన్ని ఆయన లెక్కలతో సహా ఎండగట్టారు. పనులు పూర్తి కాకుండానే ప్రాజెక్టును జాతికి అంకితం చేశామని జగన్ ప్రగల్భాలు పలికారని, భూ నిర్వాసితులకు రూ. 900 కోట్లకు పైగా పరిహారం ఇవ్వాల్సి ఉండగా, ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని ఆరోపించారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ప్రాజెక్టు పనులను వేగంగా చేపట్టిందని, పునరావాసానికి రూ. 903 కోట్లు కేటాయించిందని తెలిపారు.

సంబంధిత పోస్ట్