AP: వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరులో మంత్రి పార్థసారథి పర్యటించారు. ఈ నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే వరదరాజులరెడ్డితో కలిసి బొల్లవరం జగనన్న కాలనీని పరిశీలించారు. జగనన్న కాలనీలో జరిగిన అక్రమాలు, అవకతవకలపై లబ్ధిదారులతో నేరుగా మాట్లాడి వివరాలన్నీ తెలుసుకున్నారు. లబ్ధిదారుల నుంచి డబ్బులు తీసుకుని ఇళ్లు నిర్మించని కాంట్రాక్టర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు.