AP: మూడేళ్ల కిందట పార్టీలోకి వచ్చిన వాళ్లు పదవుల కోసం ఆరాటపడుతున్నారని మంత్రి పయ్యావుల కేశవ్ విమర్శించారు. పార్టీని, ప్రభుత్వాన్ని నడిపే విషయంలో సీఎం చంద్రబాబు నిరంతరం శ్రమిస్తున్నారని మంత్రి పయ్యావుల అన్నారు. పలువురు 30 ఏళ్లుగా పార్టీలో ఉన్నప్పటికీ పదవుల కోసం పాకులాడలేదన్నారు. సెప్టెంబర్ 6న అనంతపురంలో సూపర్ సిక్స్.. సూపర్ హిట్ పేరిట భారీ బహిరంగ సభ జరుగుతుందన్నారు.