వైసీపీ నేతపై మంత్రి రాంప్రసాద్ రెడ్డి అనుచరుల దాడి (వీడియో)

9చూసినవారు
AP: అన్నమయ్య జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. వైసీపీ బీసీ విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి సిబ్యాల విజయభాస్కర్‌పై మంత్రి రాంప్రసాద్ రెడ్డి అనుచరులు దాడి చేశారు. పట్టపగలు ఇంటిపైకి దుండగులు ఇనుప రాడ్లతో దాడికి పాల్పడ్డారు. అన్నమయ్య జిల్లా విషయంలో, మాజీ సీఎం జగన్‌పై మంత్రి రాంప్రసాద్ చేసిన వాఖ్యలపై విజయభాస్కర్ ప్రెస్ మీట్ పెట్టారు. ఆగ్రహించిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి అనుచరులు ఇంటిపై దాడి చేశారు. విజయభాస్కర్ తలకు, చేయికి గాయాలయ్యాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్