వైసీపీ డిజిటల్ బుక్‌పై మంత్రి వ్యాఖ్యలు.. వైసీపీకి సవాల్

1710చూసినవారు
వైసీపీ డిజిటల్ బుక్‌పై మంత్రి వ్యాఖ్యలు.. వైసీపీకి సవాల్
రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వైసీపీ డిజిటల్ బుక్‌పై తీవ్రంగా స్పందించారు. టీడీపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు తీసుకోలేదని, రెవెన్యూ, లిక్కర్ స్కామ్‌లలో దొరికినవారే జైలుకెళ్లారని చెప్పారు. పేదల భూములు కాజేసిన వారిపై చట్టపరంగా చర్యలు తప్పవన్నారు. తమపై బురదజల్లేందుకు వైసీపీ కొత్త బుక్ తెచ్చిందని ఎద్దేవా చేస్తూ, తమ ప్రభుత్వం రాజ్యాంగానుసారం నడుస్తుందని స్పష్టం చేశారు. ఎక్కడైనా కూటమి పార్టీలు చట్టాన్ని వ్యతిరేకించి వైసీపీ వాళ్లపై కక్షపూరితంగా చర్య తీసుకుని ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని సవాల్ విసిరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్