AP: ప్రభుత్వ విధానాలు, అమరావతి అంశంపై మాజీ సీఎం వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలకు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ ఘాటుగా స్పందించారు. తాను అవకాశవాది కాదని,
బీజేపీ సిద్ధాంతాలకే కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. జగన్‌ను వ్యక్తిగతంగా కాదు, ఆయన విధానాలనే విమర్శిస్తున్నానన్నారు. సంకీర్ణ ప్రభుత్వంపై చేసే విమర్శలను సహించబోమని హెచ్చరించారు. అమరావతి నిర్మాణం త్వరలో పూర్తవుతుందని ధీమా వ్యక్తం చేసిన ఆయన, అవసరమైతే రాజధాని అంశంపై ఎన్నికలకు వెళ్లి ప్రజల తీర్పు కోరాలని జగన్‌కు సవాల్ విసిరారు.