AP: రేపు స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని విజయవాడలో బీజేవైఎం ఆధ్వర్యంలో యూత్ మారథాన్ 2కే రన్ ఘనంగా నిర్వహించారు. రాఘవయ్య పార్క్ నుంచి ప్రారంభమైన ఈ మారథాన్‌లో రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పాల్గొని యువతను ఉత్సాహపరిచారు. కాషాయ రంగు షర్టులు ధరించిన యువకులు పెద్ద సంఖ్యలో పరుగులో పాల్గొని శక్తి, క్రమశిక్షణను ప్రదర్శించారు. యువతలో శారీరక దృఢత్వం, దేశభక్తి పెంపొందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు.