హెల్మెట్ లేకుండా బైక్ నడుపుతున్న వ్యక్తి తల్లికి ఫోన్ చేసిన మంత్రి సవిత

0చూసినవారు
AP: శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో హెల్మెట్ లేకుండా బైక్ నడుపుతున్న సాయి అనే యువకుడికి మంత్రి సవిత స్వయంగా బాధ్యతలు గుర్తుచేశారు. రహదారి భద్రతా వారోత్సవాల్లో పాల్గొన్న ఆమె యువకుడిని రోడ్డుపై ఆపి నేరుగా అతని తల్లికి ఫోన్ చేశారు. ఖరీదైన బైక్ కొనివ్వడమే కాదు హెల్మెట్ పెట్టుకునేలా చూసే బాధ్యత కూడా మీదేనని వివరించారు. సదరు యువకుడితో పాటు వెనక కూర్చున్న వ్యక్తికీ హెల్మెట్ ఇచ్చి పంపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్