AP: ఏపీ సచివాలయంలో ఆప్కో ఆధ్వర్యంలో ప్రత్యేక చేనేత కౌంటర్లను మంత్రి సవిత ప్రారంభించారు. వెంకటగిరి, గద్వాల్, మదనపల్లె, ఉప్పాడ, ధర్మవరం, మంగళగిరి పట్టు, కాటన్ చీరలు, షర్ట్‌లు, రెడీమేడ్ చేనేత వస్త్రాలపై 50 శాతం డిస్కౌంట్‌తో అమ్మకాలు జరుగుతున్నాయి. చేనేత రంగ అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని, ఏప్రిల్ 1 నుంచి నేతన్నలకు ఉచిత విద్యుత్ అమలు చేస్తున్నామని మంత్రి సవిత తెలిపారు. సచివాలయ ఉద్యోగుల నుంచి ఈ స్టాళ్లకు విశేష స్పందన లభిస్తోంది.