అక్రమాలకు పాల్పడిన వైద్య బృందంపై మంత్రి చర్యలు

77చూసినవారు
అక్రమాలకు పాల్పడిన వైద్య బృందంపై మంత్రి చర్యలు
AP: అనకాపల్లిలో ఉన్న ఎన్టీఆర్ ప్రభుత్వ ఆసుపత్రిలో గతంలో ఇన్‌పేషెంట్లు, లెక్కలు, మందుల వినియోగానికి సంబంధించిన రికార్డుల్లో అనేక అవకతవకలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారులు వివరాలతో కూడిన నివేదికను మంత్రి సత్యకుమార్‌కు సమర్పించారు. దీంతో ప్రస్తుతం వివిధ ప్రాంతాలకు బదిలీ అయిన సుమారు 21 మంది వైద్య సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి సంబంధిత ఉన్నతాధికారులను ఆదివారం ఆదేశించారు.

సంబంధిత పోస్ట్