టీడీపీ మంత్రులను పేర్ని నాని టార్గెట్ చేస్తున్నారా?

443చూసినవారు
టీడీపీ మంత్రులను పేర్ని నాని టార్గెట్ చేస్తున్నారా?
AP: వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని టీడీపీ మంత్రులను టార్గెట్ చేస్తూ తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. మంత్రి అనగాని సత్యప్రసాద్‌పై 25 కోట్ల రూపాయలు అడిగారని, మంత్రి పార్థసారథి అనుచరుడు అక్రమ మైనింగ్, పేకాట క్యాసినో నిర్వహిస్తున్నారని ఆరోపించారు. కూటమి అధికారంలోకి వచ్చాక నానిపై పలు కేసులు నమోదయ్యాయి. జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు చేస్తున్న మంత్రులపై పేర్ని నాని ఫోకస్ పెట్టి ఉండవచ్చని కొందరు భావిస్తున్నారు. మాజీ మంత్రి వ్యాఖ్యలతో మంత్రులు ఇబ్బంది పడుతున్నట్లు కనిపిస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్