మైనారిటీ నాయకులను ఇబ్బంది పెడుతున్నారు: నూరి ఫాతిమా

0చూసినవారు
AP: వైసీపీ మైనారిటీ నాయకులను కూటమి ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందని గుంటూరు ఈస్ట్ వైసీపీ ఇన్‌ఛార్జ్ నూరి ఫాతిమా అన్నారు. సోమవారం గుంటూరులో ఆమె మాట్లాడుతూ.. ‘వైసీపీ నేతలను అక్రమ కేసుల్లో ఇరికించి మానసికంగా వేధింపులకు గురి చేస్తున్నారు. వారెంట్ లేకుండా అర్ధరాత్రి కూడా వచ్చి ఇంట్లో సోదాల పేరుతో మహిళలను, కుటుంబ సభ్యులను ఇబ్బంది పెడుతున్నారు. ఎవరు చెబితే ఇలా చేస్తున్నారో పోలీసులు సమాధానం చెప్పాలి’ అని అన్నారు.

సంబంధిత పోస్ట్