AP: కాకినాడ జిల్లా తునిలో అదృశ్యమైన చిన్నారి జ్ఙానేశ్వరి అలియాస్ జాహ్నవి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ నెల 6న పాప కనిపించకుండా పోయిన రోజు ఏం జరిగిందో స్థానిక సీఐ చెప్పారు. ఆ రోజు ఆ 15 నిమిషాలు చాలా కీలకమన్నారు. ఆ రోజు మ.12 గంటల సమయంలో పాప తండ్రి కోసం తోట వైపు వెళ్లిందని చెప్పారు. పాప వెంట కుక్క కూడా ఉందని, ఆ విషయాన్ని స్థానిక యువకుడు తమతో చెప్పారన్నారు. పాప ఒంటరిగా ఉండటంతో కాపాడాలని చూశాడని, అయితే కుక్క ఆ యువకుడ్ని దగ్గరికి రానివ్వలేదని చెప్పాడన్నారు. యువకుడు భయంతో ఊరిలోకి వెళ్లి అందరికి ఆ విషయం చెప్పగా.. యువకులంతా అక్కడికి వెళ్లి చూస్తే పాప కనిపించలేదన్నారు. కేవలం 15 నిమిషాల వ్యవధిలోనే పాప, కుక్క కనిపించకుండా పోయారన్నారు.